← Back to news

ఆరోగ్యమే లక్ష్యం.. జనగామలో వెల్‌నెస్ వాక్

By Bala· 16h ago
ఆరోగ్యమే లక్ష్యం.. జనగామలో వెల్‌నెస్ వాక్

జనగామ జిల్లాలో 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయుర్వేద వెల్‌నెస్, యోగా వాక్ నిర్వహించారు. నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన వాక్‌ను డీసీపీ రాజ మహేంద్ర నాయక్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఆయుర్వేదం, యోగా, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని సూచించారు. యోగా, ఆయుర్వేదంతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని DMHO వాణిశ్రీ తెలిపారు. వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశాలు, విద్యార్థులు, ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు.

More in Local