కావలిలో మహిళల కోసం ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో మహిళల స్వయం ఉపాధి కోసం వంటేరు వరదా రెడ్డి Charitable Trust ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బ్రాహ్మణక్రాకలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు మాజీ MLA వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వడంతో పాటు, పూర్తిచేసిన వారికి ధ్రువపత్రాలు అందజేస్తారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు.


