← Back to news

అప్పుల బాధతో వ్యక్తి బలవన్మరణం

By Bala· 1d ago
అప్పుల బాధతో వ్యక్తి బలవన్మరణం

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మల్లంపేట శివారులో 41 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయిలు చేపలు పడుతూ జీవనం సాగించేవాడు. కొంతకాలంగా పనిలేకపోవడంతో అప్పులు అయ్యాయి. శనివారం మద్యం సేవించి ఇంటికి వెళ్లిన సాయిలును భార్య ప్రశ్నించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం గ్రామ శివారులోని కుంట సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Local