చిరు వ్యాపారులకు జీవనోపాధి

నియోజకవర్గంలో చిరు వ్యాపారులకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో టిఫిన్ బండి, తోపుడు బండి, ఫ్లాట్‌ఫామ్ రిక్షాలను అందజేయడం అభినందనీయమని గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు కొనియాడారు. మంగళగిరి 3వ వార్డుకు చెందిన ఉషారపు శిరీషకు టిఫిన్ బండి, 6వ వార్డుకు చెందిన సింగంపల్లి నారాయణకు తోపుడు బండి, రత్నాల చెరువుకు చెందిన బొర్ర సత్యనారాయణకు ఫ్లాట్‌ఫామ్ రిక్షా అందజేశారు.



