ఆ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఆగయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8వేల ఎకరాల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు బదిలీ అయ్యాయన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పందించారు. ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. 8 వేల ఎకరాలకు సంబంధించిన గ్రామాలు, సర్వే నంబర్లు, ఎవరికి భూములు బదిలీ అయ్యాయో, ఈ అంశంపై RTI ద్వారా సమాచారం సేకరిస్తున్నామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.



