రావణుడి పుట్టిల్లు ఎక్కడో తెలుసా?
దేశమంతా దసరా వేడుకలు జరుపుకుంటూ రావణాసురుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. కానీ ఒక గ్రామంలో మాత్రం ఇవాళ రావణుడి మరణానికి విచారం వ్యక్తం చేస్తూ శోకదినంగా మౌనం పాటిస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గౌతమ్ బుద్ధ నగర్(గ్రేటర్ నోయిడా) జిల్లాలో బిస్రఖ్ గ్రామంలో రావణుడు పుట్టాడని స్థానికుల నమ్మకం. ఇక్కడ దసరా సంబరాలు చేసుకోరు. రావణుడికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తారు. దసరా జరుపుకోవడానికి ప్రయత్నిస్తే విపత్తులు జరుగుతాయని స్థానికులు నమ్ముతారు.



