← Back to news

కారు డోర్లు లాక్, చిన్నారి మృతి

By Krishna· 1d ago· X

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. జూలూరుపాడు మండలం.. వినోబానగర్‌లో సర్పంచ్ గంగావత్ నవీన్ నాలుగేళ్ల కూతురు తన్వితా శ్రీ ఆటలాడుతూ, ఇంటి ముందు పార్క్ చేసిన కారులోకి వెళ్లి, డోర్లు లాక్ కావడంతో దాదాపు రెండు గంటలు చిక్కుకుపోయి ఊపిరాడక మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఆమెను కనుక్కొని కారు గ్లాస్ పగలగొట్టి బయటకు తీసి, కొత్తగూడెం ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు తేల్చారు. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in TG