← Back to news

రూ.12 వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు బకాయిలు విడుదల చేయాలి

By Bhasker Mamilla· 4d ago
రూ.12 వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు బకాయిలు విడుదల చేయాలి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.12 వేల కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగనమోని బంగారు బాబు డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్‌లోని MRO కార్యాలయం ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం ఏబీవీపీ నాయకులు డిప్యూటీ MROకు వినతిపత్రం అందజేశారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.