← Back to news

బతుకమ్మ పూలకు El Nino సెగ..

By Prashanth· 10 Oct 2026
బతుకమ్మ పూలకు El Nino సెగ..

TG: రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం కావడంతో పూల ధరలు ఆకాశాన్ని అంటాయి, ఈసారి ఎల్‌నినో ప్రభావం వలన తక్కువ వర్షాలు కురవడంతో పూల దిగుబడి తగ్గింది. దీంతో సహజంగా లభించే తంగేడు, గునుగు పూలకు కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. తంగేడు పూల కట్ట ₹ 100, మూడు నుంచి నాలుగు గునుగు కట్టలు ₹100–120 వరకు ఉంది. కిలో బంతి పూలు ₹150, 50 గ్రాముల చేమంతులు ₹50కి అమ్ముతున్నారు. పూల ధరలు పెరగడంతో పండుగ ఖర్చు పెరిగిందని ప్రజలు అంటున్నారు.

More in TG