← Back to news

మట్టి తరలింపు ప్రతిపాదనపై గ్రామస్థుల ఆందోళన

By J Chakravarthy· 1d ago· Dhanwada, Dhanwada, Narayanpet
మట్టి తరలింపు ప్రతిపాదనపై గ్రామస్థుల ఆందోళన

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం యంనోనిపల్లి గ్రామంలోని 159సర్వే నంబర్‌లో భారత్‌మాల జాతీయ రహదారి (ఎక్స్‌ప్రెస్‌వే) నిర్మాణ పనుల కోసం మాలగుట్ట మట్టిని తరలించే ప్రతిపాదనపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుట్టకు సంబంధించిన 20ఎకరాల భూమిలో MRO ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాలగుట్ట మట్టిని తవ్వి తరలిస్తే ప్రకృతి సమతుల్యత దెబ్బతినడంతో పాటు గ్రామ పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.

More in Local