హైడ్రా ప్రజలను వేధించే సంస్థ: ఈటల

TG: BJP MP ఈటల రాజేందర్ మరోసారి హైడ్రాపై తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా ప్రజలను వేధించే సంస్థగా మారిందని, ఇళ్లు కూల్చివేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదని అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హిట్లర్ పాలనను ఉదాహరణగా తీసుకున్న CM రేవంత్ రెడ్డి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఫైరయ్యారు. పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేస్తున్నారని, హైడ్రాను రాజకీయ కక్ష సాధింపునకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఆ సంస్థ చర్యలతో హైదరాబాద్‌లో ఇల్లు కొనాలంటే ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు


