PV సింధు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!

ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుకు ఇండోనేషియా ఓపెన్‌లో మరోసారి షాక్ తగిలింది. ఈరోజు జరిగిన రౌండ్-ఆఫ్-16 మ్యాచ్‌లో సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ ఆన్ సే-యంగ్ చేతిలో సింధు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆన్ సే-యంగ్ 17-21, 14-21 స్కోర్‌తో సింధుపై ఈజీగా గెలిచింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే. ఇప్పటివరకు వీరిద్దరి మధ్య జరిగిన మొత్తం 10 మ్యాచ్‌ల్లోనూ సింధు ఓడిపోయింది. లాస్ట్ వీక్ జరిగిన సింగపూర్ ఓపెన్ క్వార్టర్స్‌లో కూడా సింధు ఓటమి ఫేస్ చేసిన సంగతి తెలిసిందే.


