3 కంపెనీలను హ్యాక్ చేసిన Gemini AI

గూగుల్ సైబర్ సెక్యూరిటీ పరీక్షలు నిర్వహిస్తుండగా Gemini AI ఊహించని విధంగా 3 కంపెనీల డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లోకి అనధికారికంగా ప్రవేశించింది. బహిరంగ వెబ్‌లోని బలహీన పాస్‌వర్డ్‌లను ఊహించి ఈ పని చేసినట్లు గూగుల్ తెలిపింది. అయితే ఆయా సంస్థల డేటాకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. ఘటనను గుర్తించిన వెంటనే పరీక్షా వ్యవస్థను ఆటోమేటిక్‌గా నిలిపివేసినట్లు వెల్లడించింది. ఈ ఘటన శక్తిమంతమైన AI మోడళ్లకు స్ట్రాంగ్ సెక్యూరిటీ కంట్రోల్స్ అవసరమని మరోసారి చూపించింది.



