← Back to news

చలాన్ కట్టినా సర్వే కాలేదు.. రైతుల తీవ్ర ఇబ్బందులు

By Journalist Wenky· 25 Aug 2026· Jagitial
చలాన్ కట్టినా సర్వే కాలేదు.. రైతుల తీవ్ర ఇబ్బందులు

TG: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలానికి వెంటనే సర్వేయర్‌ను నియమించాలని తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి ప్రజావాణిలో అధికారులను కోరారు. తన వ్యవసాయ భూమి సర్వే కోసం మీ సేవ ద్వారా ఎఫ్‌లైన్ పిటిషన్ దాఖలు చేసి చలాన్ చెల్లించినా 14 నెలలుగా సర్వే జరగలేదని తెలిపారు. మండలంలోని అనేక మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎఫ్‌లైన్ పిటిషన్ల ద్వారా చలాన్ చెల్లించిన రైతుల భూములకు కొలతలు నిర్వహించి, చట్టబద్ధంగా హద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో ఎం.సుమంత్‌ను కోరారు.

More in Local