← Back to news

మున్సిపల్ నియామకాల్లో అక్రమాలు.. కార్మికుల నిరసన

By Mohan· 3h ago· Saradhi, Rajam, Vizianagaram

మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని విజయనగరం జిల్లా రాజాం మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించారు. మున్సిపాలిటీలో పనిచేస్తూ మృతి చెందిన, రిటైర్ అయిన కార్మికుల స్థానాల్లో వారసులు, కొత్తవారి నియామకాల్లో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని యూనియన్ గౌరవ అధ్యక్షుడు రామ్మూర్తి నాయుడు, అధ్యక్షుడు పడాల లక్ష్మి, కార్యదర్శి అనిల్‌కుమార్ ఆరోపించారు. కొత్త కార్మికుల నియామకాల్లో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, పనితో సంబంధంలేని వారిని నియమిస్తున్నారని విమర్శించారు.

More in Local