రాజనగరంలో పిడుగులతో దంచికొట్టిన వాన!
AP: తూర్పు గోదావరి జిల్లా రాజనగరంలో ఈరోజు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో వాన కుమ్మేసింది. గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లు, డ్రైనేజీలు నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రానున్న రెండు, మూడు రోజులు కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.


