← Back to news

పిఠాపురంలో ఉచిత కంటి వైద్య శిబిరం

By DK· 16h ago
పిఠాపురంలో ఉచిత కంటి వైద్య శిబిరం

కాకినాడ జిల్లా పిఠాపురంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, కాకినాడ దృష్టి కంటి ఆసుపత్రి వైద్య బృందం సహకారంతో ఈ శిబిరం జరిగింది. డాక్టర్ యన్.మాధురి ఆధ్వర్యంలోని వైద్య సిబ్బంది పలువురికి కంటి పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు, అవసరమైన చికిత్స అందించారు. పరీక్షల్లో కంటి ఆపరేషన్ అవసరమైన సుమారు 20 మందిని గుర్తించి కంటి ఆసుపత్రికి తరలించినట్లు ట్రస్ట్ చైర్మన్ టి.కరుణ్ రాజు తెలిపారు.

More in Local