కరువు రైతులను వెంటనే ఆదుకోవాలి

రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులను గవర్నమెంట్ వెంటనే ఆదుకోవాలని AIKMS రాష్ట్ర కార్యదర్శి గనిరాజు డిమాండ్ చేశారు. గుంటూరులో జరిగిన పార్టీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కరువు ప్రాంత రైతులకు రుణమాఫీ చేయాలని, పంట నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఉచిత విత్తనాలు, ఎరువులు, లోన్లు అందించాలని కోరారు. ఉచిత పంటల బీమా అమలు చేసి, వ్యవసాయ కూలీలకు ఉపాధి చూపించాలని ప్రభుత్వాన్ని అడిగారు.



