సైబర్ మోసం.. రూ.20 వేలు కాజేసిన వ్యక్తి అరెస్ట్

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం సైబర్ నేరానికి పాల్పడి రూ. 20 వేలు కాజేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రామన్నగూడెంకు చెందిన కిరాణా వ్యాపారి భాస్కర్‌రెడ్డికి ఫోన్ చేసి క్యూఆర్ కోడ్, బ్యాలెన్స్ పరిశీలించుకోవాలంటూ లింక్ పంపాడు. దాన్ని ఓపెన్ చేయగానే ఖాతా నుంచి రూ.20 వేలు అపహరించాడు. దర్యాప్తులో ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా కాజీపేట మండలం సుంకేసులకు చెందిన గంగిరెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డిగా గుర్తించి అరెస్టు చేశారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.



