కబడ్డీ టోర్నీ.. సూర్యాపేటలో సెలక్షన్ పోటీలు!

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామ జడ్పీ హైస్కూల్ మైదానంలో కబడ్డీ సందడి. SGFI సూర్యాపేట నియోజకవర్గ స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు–2026–27 టోర్నమెంట్, సెలక్షన్ పోటీలు ప్రారంభమయ్యాయి. AICC సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర Congress సీనియర్ నాయకులు పోతు భాస్కర్ లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. అప్పుడే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని అన్నారు.



