జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, కమిషనర్ హన్మంతరెడ్డి పాల్గొని మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని చైర్పర్సన్ పేర్కొన్నారు. మహిళా కౌన్సిలర్లు, మెప్మా ఆర్పీలు, మహిళా సిబ్బందితో కలిసి ఆమె బతుకమ్మ పాటలకు ఆడిపాడి సందడి చేశారు.


