ఎరువుల కోసం రైతుల పడిగాపులు

AP: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో పంటలకు యూరియా, DAP వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ DBT Fertilizer యాప్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రెండు రోజులుగా ఎరువుల విక్రయాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కాకినాడ జిల్లా పెద్దాపురంతో పాటు పలు ప్రాంతాల్లో రైతులు దుకాణాల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఎరువులు అందక కొందరు రైతులు ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్నారు. సర్వర్ సమస్యకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.



