← Back to news

విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలి: DATA డిమాండ్

By Chakravarthy· 1d ago· Nalgonda, Nalgonda, Nalgonda
విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలి: DATA డిమాండ్

నల్లగొండలోని టీఎన్జీవో భవన్‌లో DATA ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. డాక్టర్ మహమ్మద్ మోహినుద్దీన్ మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు ఫీజు రెగ్యులేషన్ కమిషన్, శాలరీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లి జీవో 97ను వెంటనే రద్దు చేయాలన్నారు. విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అప్పగించడాన్ని ఆయన విమర్శించారు.

More in Local