పోక్సో కేసు నమోదు.. నిందితుడు మృతి!

రంగారెడ్డి జిల్లా మీర్పేట్లో పోక్సో కేసు నమోదైన వ్యక్తి మృతి చెందాడు. అల్మాస్గూడకు చెందిన హర్షవర్ధన్ రెడ్డిపై ఈ నెల 12న మైనర్ బాలికను సెల్ఫోన్లో వీడియో తీసినట్లు ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు భయంతో తుర్కయంజాల్లోని రాఘవేంద్ర కాలనీలో బంధువుల ఇంట్లో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.


