జ్ఞానేశ్ కుమార్ అతి పెద్ద దేశద్రోహి: అభిజీత్ దీప్కే

సుప్రీంకోర్టు అనుమతి లేకుండా జ్ఞానేశ్ కుమార్ ఫారం-6 మార్చేశాడు. ఎవరి ఆదేశాల మీద ఇలా చేశాడు? అని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. జ్ఞానేశ్ కుమార్ సొంతంగా పని చేయలేదని, అతను తన రాజకీయ యజమానులకు సేవ చేస్తున్నాడని విమర్శించారు. చట్టాన్ని వారి ప్రయోజనాల కోసం పక్కన పెట్టాడని అన్నారు. భారతదేశానికి అతను అతి పెద్ద ద్రోహి అని పేర్కొన్నారు.


