← Back to news

ముంపు గ్రామాల పెండింగ్ నిర్వాసితుల జాబితా విడుదల

By DK· 15h ago
ముంపు గ్రామాల పెండింగ్ నిర్వాసితుల జాబితా విడుదల

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల పెండింగ్ నిర్వాసితుల జాబితాలను జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. మార్కాపురం మండలంలోని గొట్టిపడియా, అక్కచెరువు గ్రామాలకు సంబంధించిన జాబితాలను జిల్లా కలెక్టర్ విజయ సునీత మార్కాపురం తహశీల్దార్ కార్యాలయానికి పంపించారు. దీంతో తహశీల్దార్ చిరంజీవి కార్యాలయ నోటీసు బోర్డులో జాబితాలను ప్రచురించారు. నిర్వాసితుల వివరాలను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

More in Local