← Back to news

కన్నకొడుకుపై వృద్ధ తల్లిదండ్రుల నిరసన

By Bala· 4h ago· X· TG

TG: హైదరాబాద్.. మియాపూర్ లోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో తమను ఇంటి నుంచి గెంటేశారంటూ.. కొడుకు ఇంటి ముందు ధర్నాకు దిగారు దేవులపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు. తమకు తెలియకుండానే తమ ఇల్లు అమ్మకానికి పెట్టారనీ.. కొడుకు, కోడలు.. తమను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. ఇలా వారు ఆందోళనకు దిగడం స్థానికులను కలచివేస్తోంది. ఇలాంటి పరిస్థితి ఏ పేరెంట్స్‌కీ రాకూడదని వారంటున్నారు.

More in TG