మేఘాలు.. అక్కడక్కడా వానలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవాళ ఆదివారం పొడి వాతావరణం ఉంటుంది. అక్కడక్కడా మేఘాలు ఉంటాయి. రాయలసీమ, ఉత్తరాంధ్రలో అక్కడక్కడా జల్లులు పడతాయి. తెలంగాణలో వర్షం పడే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. APలో ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ ఉంటే, తెలంగాణలో 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో గాలి వేగం గంటకు గంటకు 20 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 10 వరకూ అక్కడక్కడా లైట్ రెయిన్ పడుతుందని IMD చెప్పింది. ప్రయాణాలకు అనుకూల వాతావరణం ఉంటుంది.


