← Back to news

ఇళ్ల మధ్య కొండచిలువ.. పరుగులు తీసిన జనం

By Bala· 21h ago
ఇళ్ల మధ్య కొండచిలువ.. పరుగులు తీసిన జనం

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పలు గ్రామాల్లో కొండచిలువలు, రక్తపింజర్లు సంచరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లింగోజిగూడలో అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో రక్తపింజర కనిపించగా, సికింద్లాపూర్‌లో ఇళ్ల మధ్యకు భారీ కొండచిలువ వచ్చింది. తాజాగా పోతిరెడ్డిపల్లి తండాలో పొలంలోకి మరో కొండచిలువ రావడంతో రైతులు భయపడుతున్నారు. అటవీ అధికారులు స్పందించి వాటిని పట్టుకుని జనావాసాలకు దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

More in Local