కళాశాలల పక్కనే సిగరెట్ల దుకాణాలు

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ శివారులోని ఇంటర్, డిగ్రీ, బీటెక్ కళాశాలల సమీపంలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు పొగాకు, సిగరెట్లకు అలవాటు పడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. గంజాయిపై నిఘా పెడుతున్న పోలీసులు, పొగాకు విక్రయాల నియంత్రణపైనా కూడా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. విద్యాసంస్థల సమీపంలో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.


