పీలేరు బ్యాడ్మింటన్ స్టార్.. నేషనల్స్ కు దీక్షిత! 🏸

వైఎస్ఆర్ కడప జిల్లా పీలేరుకు చెందిన దీక్షిత జాతీయస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీకి క్వాలిఫై అయ్యింది. విజయవాడలో జరిగిన అండర్-14 బ్యాడ్మింటన్ పోటీల్లో రెండు కేటగిరీల్లో సత్తా చాటింది. తండ్రి హరి కువైట్లో ఉంటున్నారు. తల్లి ఉషారాణి పీలేరులో ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. ఈమె రెండు కేటగిరీల్లో నేషనల్స్కు సెలెక్ట్ అవ్వడం విశేషం. కూతురి ప్రతిభపై కుటుంబం ఫుల్ హ్యాపీ. మరో యంగ్ ఛాంపియన్ పుట్టింది కదా!.. మీ గ్రామాల్లో కూడా ఇలాంటి యువకెరటాలు సాధించే విజయాలను వార్తలుగా పంపండి.



