వారానికి ఒకసారైనా పెసరట్టు ఎందుకు తినాలి?

పెసరట్టును whole green gramతో తయారుచేస్తారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు బాగా ఉంటాయి. 2025 నాటి ఫుడ్ రివ్యూస్ ఇంటర్నేషనల్ స్టడీ ప్రకారం పెసలులో డయాబెటిస్ కంట్రోల్ చేసే, కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. నాన్-సాయ్ లెగ్యూమ్స్ మెటా-అనాలిసిస్ ప్రకారం.. పెసలు తినేవారికి టోటల్, LDL కొలెస్ట్రాల్ బాగా తగ్గాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటోంది. జీర్ణశక్తికీ, బరువు తగ్గేందుకూ ఇవి మంచివి. వారానికి ఒకసారైనా తింటే ఈ ప్రయోజనాలు లభిస్తాయి.



