← Back to news

మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన..!

By Surender· 1h ago· PR Colony, Mahbubnagar, Mahabubnagar
మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన..!

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం జరిగింది. విద్యార్థినులకు మహిళల భద్రత, వేధింపుల నివారణపై అవగాహన కల్పించారు. ఏఎస్ఐ జానా రాణి, కానిస్టేబుల్ అనురాధ మాట్లాడారు. మహిళల హక్కులు, భద్రతా చర్యలు, అత్యవసర సమయంలో అధికారులను సంప్రదించే విధానాలను వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అమీనా ముంతాజ్ జహాన్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ జె. శ్రీదేవి, ఎన్‌సీసీ కోఆర్డినేటర్ డా. పి. ఉషా లక్ష్మి పాల్గొన్నారు.

మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన..!

More in Local