కుటుంబానికి గల్ఫ్ చేయూత సంఘం భరోసా

ప్రమాదంలో మృతిచెందిన కుటుంబానికి అండగా నిలుస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లి గ్రామానికి చెందిన నాకిడి నర్సయ్య కుటుంబానికి గల్ఫ్ చేయూత సంఘం రూ.51,500 ఆర్థిక సాయం అందించింది. గత నెల 24న నర్సయ్య ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలుసుకున్న సంఘం సభ్యులు బుధవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. గల్ఫ్ చేయూత సంఘం తరఫున రూ.51,500 అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచేందుకు ఈ ఆర్థిక సాయం చేసినట్లు సంఘం సభ్యులు తెలిపారు.



