‘టాక్సిక్’ పోటీ ఉన్నా తగ్గేదేలే అంటున్న ‘ఇరుముడి’

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ వారమే యష్ నటించిన పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' విడుదలైనప్పటికీ, 'ఇరుముడి' క్రేజ్ మాత్రం తగ్గలేదు. బుక్ మై షోలో ఈ వీకెండ్ 'టాక్సిక్' కి 15 వేల టికెట్లు అమ్ముడవగా, 'ఇరుముడి' 23 వేలకు పైగా టికెట్లతో ముందంజలో ఉంది. తక్కువ థియేటర్లలో ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తుండటంతో ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది.



