అలా భయపడితే ముందుకు వెళ్లలేం!

నటి కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై స్పందించింది. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను పట్టించుకుంటూ పోతే మన నిర్ణయాలు మనం తీసుకోలేమని చెప్పింది. విమర్శలకు భయపడి ఉంటే జీవితంలో ముందుకు వెళ్లలేమని తెలిపింది. కొన్నిసార్లు అందరూ మనల్ని మెచ్చుకుంటారని, మరికొన్ని సందర్భాల్లో మనకు మనమే అండగా నిలవాలని చెప్పింది. ఇతరుల మాటల కంటే మనపై మనకు నమ్మకం ఉండాలని సూచించింది.



