Arattai App ఎందుకు వెనకబడింది?

జోహో కార్పొరేషన్ డెవలప్ చేసిన స్వదేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ గతేడాది ఫేమస్ అయ్యింది. జోహో 2021 జనవరిలో ఈ యాప్‌ను లాంచ్ చేసినా 2025 సెప్టెంబర్‌లో ఫేమస్ అయ్యింది. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్వదేశీ’ ఉద్యమంలో భాగంగా దీన్ని ప్రచారం చేయడంతో భారీ ఆదరణ లభించింది. అయితే ఈ హైప్ ఎక్కువకాలం నిలవలేదు. నవంబర్ నాటికి డౌన్‌లోడ్లు రెండు లక్షలకు పడిపోయాయి. నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య కూడా తగ్గింది. నెట్‌వర్క్ ఎఫెక్ట్, కొత్తగా లేకపోవడం, ప్రైవసీపై అనుమానాలు, టెక్నికల్ సమస్యలే ఇందుకు కారణాలని నిపుణులు అంటున్నారు.



