← Back to news

ఉత్తరాంధ్రకు Flash Flood అలర్ట్: IMD

By Mahesh· 8h ago· AP
ఉత్తరాంధ్రకు Flash Flood అలర్ట్: IMD

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్‌తో ఉత్తరాంధ్రకు IMD హై అలర్ట్ జారీ చేసింది. వాయుగుండంగా బలపడి, పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపు అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్, 6 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు. పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఇచ్చారు. నాలుగు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు ఎమర్జెన్సీ ఇతే తప్ప బయటకు రావొద్దని అధికారులు అలర్ట్ చేశారు.

More in AP