కరువు పరిస్థితులపై 12న సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

TG: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 12న మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీనివల్ల దాదాపు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాభావంతో దెబ్బతిన్న మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, ఆదుకోవడానికి ₹20,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది.



