← Back to news

జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కలెక్టరేట్ వద్ద ధర్నా

By P.Abhi· 1d ago· Nandyala, Nandyal Urban, Nandyal

న్యూఢిల్లీలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై పోలీసుల దాడిని నిరసిస్తూ నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట APWJF, APMF యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్య హక్కులపై దాడులేనని వారు పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Local