INDIA భేటీకి అఖిలేశ్ డుమ్మా

ఢిల్లీలో INDI కూటమి భేటీకి సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హాజరుకాలేదు. SIRపై ఉమ్మడి ఆందోళన, CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌పై ఈ సమావేశం జరిగింది. రాజ్యసభ నామినేషన్ల పనుల వల్లే అఖిలేశ్ రాలేదని SP తెలిపింది. ఐతే, ఉత్తరప్రదేశ్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై చర్చలే ఆయన రాకపోవడానికి కారణమై ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. SP నుంచి మొహిబుల్లా నద్వీ, హరేంద్ర మాలిక్ హాజరయ్యారు.


