చట్టంలోనే కాదు.. సేవలోనూ ఖాకీ మార్క్
AP: పార్వతీపురం మన్యం జిల్లా.. కంటుగూడలో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో నీలకంఠాపురం SI రమేష్ నాయుడు, పోలీసు సిబ్బంది.. స్థానికులతో కలిసి కాలువపై కర్రల వంతెనను నిర్మించారు. దీంతో విద్యార్థులు ఈజీగా కెనాల్ దాటగలుగుతున్నారు. స్టూడెంట్స్ కష్టాలను గుర్తించి వంతెన ఏర్పాటు చేసిన పోలీసులను గిరిజనులు అభినందించారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి.. కామెంట్ చెయ్యండి.



