పారిశుధ్య నిర్వహణపై కలెక్టర్ సమీక్ష

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం గ్రామీణ పారిశుధ్యంపై కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎంపీవోలతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, చెత్త పేరుకుపోకుండా రోడ్లు, వీధులు, డ్రైనేజీలు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని, ప్రజలు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీమాల, ఎంపీవోలు, అధికారులు పాల్గొన్నారు.




