← Back to news

చెత్తకుప్పలో గాంధీ, సరస్వతీదేవి విగ్రహాలు!

By BK· 2 Oct 2026· శ్రీకాకుళం

AP: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్టలో గాంధీజీ జయంతి రోజే ఘోరం జరిగిందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. స్కూల్ ఏరియాలోని గాంధీ విగ్రహంతోపాటు సరస్వతీదేవి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి చెత్తకుప్పల్లో పడేసినట్టు చెప్తున్నారు. రోజూ స్కూల్ దగ్గర మందు తాగి ఉండే మందుబాబులే ఈ పని చేసి ఉంటారని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై ఇంకా పోలీసులకు ఎటువంటి కంప్లైంట్ అందలేదు.

More in AP