← Back to news

బస్సుల కోసం విద్యార్థుల ధర్నా

By Bala· 1d ago· X

సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బేలపూర్‌లో బస్సుల కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. సమయానికి ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సర్వీసులను సక్రమంగా నడిపి తమ సమస్యను పరిష్కరించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. విద్యార్థుల ధర్నాతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

More in Local