← Back to news

జర్రీల మెయిన్ రోడ్డు.. మహా డేంజర్!

By Somesh· 1d ago
జర్రీల మెయిన్ రోడ్డు.. మహా డేంజర్!

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని జర్రీల మెయిన్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. సీలేరు రూట్‌లోని ముళ్లమెట్ట సెంటర్ నుంచి మొండిగెడ్డ వరకు ఈ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఆటోలు, బైకులపై వెళ్లే వారంతా ప్రమాదాల బారిన పడుతున్నారు. నర్సీపట్నం డిపో నుంచి మూడు ట్రిప్పులు నడిచే బస్సు కూడా గుంతల కారణంగా మధ్యలోనే ఆగిపోతోంది. రింతాడ, వంచుల, జర్రీల, మొండిగెడ్డ, ఎ.దారకొండ పంచాయతీల గిరిజన ప్రజలు వెంటనే రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

More in Local