ఎన్నికల సంఘం పారదర్శకతను నిరూపించుకోవాలి

న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో TPCC అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం పాల్గొన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు వంటిదని, ఓటర్ల హక్కులకు భంగం కలిగించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, ఎన్నికల సంఘం పారదర్శకతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. CEC జ్ఞానేశ్ కుమార్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు.



