నిట్ వరంగల్‌లో విద్యార్థులకు గోల్డ్ మెడల్స్

నిట్ వరంగల్‌లో రెండు రోజులుగా నిర్వహించిన 24వ స్నాతకోత్సవం ఆదివారం ముగిసింది. చివరి రోజు 945 మంది పీజీ, 100 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు. బీవీఆర్ మోహన్‌రెడ్డి, నిట్ డైరెక్టర్ ఆచార్య బిద్యాధర్ సుబూధి పట్టాలను ప్రదానం చేశారు. ఎంటెక్‌లో అడెపు అంజలి, సైన్సెస్ అండ్ మేనేజ్‌మెంట్‌లో జలుమేడి భరణి ఓవరాల్ టాపర్లుగా నిలిచి డైరెక్టర్ గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.



