కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవిపై పెరిగిన పోటీ

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ పదవిని SC జనరల్కు రిజర్వ్ చేశారు. దీంతో రెండు ప్రధాన పార్టీల్లో ఈ పదవి కోసం పోటీ పెరిగింది. పలువురు అభ్యర్థులు చైర్మన్ పదవిని ఆశిస్తుండటంతో ఎవరికి అవకాశం కల్పించాలనే అంశంపై ఆయా పార్టీల అగ్రనాయకత్వం తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక పార్టీ నేతలకు సవాలుగా మారింది. సామాజిక సమీకరణాలు, రాజకీయ బలాబలాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


