ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని 32వ వార్డు భగత్సింగ్ నగర్కు చెందిన వైఎస్సాఆర్ ట్రేడ్ యూనియన్ సభ్యులు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. స్పందించిన సోమిరెడ్డి, తన పరిధిలో సాధ్యమైనంత సహకారం అందించి సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంధ ఉమామహేశ్వరరావు, మంధ వీరరాజు, ఆర్. దేవదాసు, తదితరులు పాల్గొన్నారు.



